పుత్తూరు ఆపరేషన్ సక్సెస్: టార్గెట్ తిరుమల?

 

Operation Puttur, TERRORISTS IN PUTTUR, AP TN police Joint operation against Terrorists, tirupati, Police Operation

 

 

పుత్తూరులో టెన్షన్ వాతావరణానికి తెరపడింది. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నంలో ఆక్టోపస్ బృందం చేపట్టిన ఆపరేష్‌న పూర్తైంది. 11 గంటలపాటు సాగిన ఆక్టోపస్ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు అదుపులోకి తీసుకున్నారు. బిలాల్, మున్నాలను రహస్యంగా ఆంబులెన్స్‌లో తరలించారు.

 

ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారం పుత్తూరులోని ఓ ఇంటి వద్ద తమిళనాడు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమమంలో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సీఐ రామకృష్ణ చికిత్స పొందుతూ మృతి చెందగా, కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు.



భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు సమాచారం. రెండున్నరేళ్లుగా ఉగ్రవాదులు చిత్తూరులోనే ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు, పలమనేరు, చంద్రగిరి ప్రాంతాల్లో వారు నివాసమున్నారు. తిరులమ, తిరుపతి, అలిపిరి,శ్రీనివాసం, విష్ణువాకం, ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్, రిజర్వేషన్ కౌంటర్లు, చంద్రగిరి శ్రీవారి మెట్లమార్గం, సీఎం కిరణ సొంతూరు నగరిపల్లిలో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం.



పాతబట్ట వ్యాపారం చేస్తూ జీవనం సాగించిన ఉగ్రవాదులు మొబైల్ ఫోన్‌ను ఉపయోగించలేదు. స్థానికులకు ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే వారు మకాం మార్చేవారు. వీరి కోసం రెండున్నరేళ్లుగా ఎన్ఐఏ,కౌంటర్ ఇంటలిజెన్స్ గాలింపు చర్యలు చేపట్టారు. బెంగుళూరు పేలుళ్లు, తమిళనాడు బీజేపీనేత హత్య, అద్వానీ హత్యకు కుట్రపన్నిట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు కేరళకు చెందిన అల్ ఉమా ఉగ్రవాదులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.