TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒడిషా ఎమ్మెల్యే హికాకా విడుదల

Published on: Thu Apr 26, 2012 12:15PM

మావోయిస్టుల చెర నుంచి ఒడిశా ఎమ్మెల్యే హికాకా విడుదలయ్యారు. కోరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ ఎమ్మెల్యే హికాకాను మావోయిస్టులు విజయఘాటి అడవుల్లో వదిలిపెట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే ఒప్పందంతో మావోలు జిన్నా హికాకాను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇటీవల జరిగిన ప్రజాకోర్టులో రాజీనామా చేస్తానని లిఖిత పూర్వక హామీ ఇచ్చారని తెలుస్తోంది. బిజెడితో అన్ని సంబంధాలను తెంచుకొని సాధారణ పౌరుడిగా జీవించాలని ఆయనను మావోలు ఆదేశించారట. అపహరణ అనంతరం ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జిల్లా బిజెడి కార్యకర్తలు, నాయకుల తీరుపై హికాక అసంతృప్తి కూడా వ్యక్తం చేశారట.