బాద్ షా వచ్చేస్తున్నాడోచ్...!
Published on: Fri Mar 15, 2013 6:25PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బాద్ షా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. తేదీనే కాదు... నిముషాలతో సహా సినిమా విడుదల ముహుర్తాన్ని ఖరారు చేశాడు నిర్మాత బండ్ల గణేష్. ముందుగా అనుకున్నట్టుగానే ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేస్తున్నారు. అదే రోజు ఉదయం 5 గంటల 23 నిముషాలకు అన్ని ప్రధాన నగరాల్లో సినిమా విడుదల అయ్యేలా ముహుర్తం నిర్ణయించారు. కాబట్టీ.... వచ్చే నెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతున్నాడు బాద్ షా.


