TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బ్యాంకు ఖాతాదారులకు ఊరట... నో ట్రాన్షాక్షన్ ఫీజులు

Published on: Wed Mar 8, 2017 12:07PM


నోట్ల రద్దు నిర్ణయం తరువాత బ్యాంకులు రోజుకో నిర్ణయం తీసుకుంటూ సామాన్య ప్రజలకు తలనొప్పి తెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి తోడు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఇంకా చుక్కలు చూపిస్తున్నారు. ఒకవైపు ఏటీఎంలు, బ్యాంకులు దగ్గర నిల్చొని డబ్బులు తీసుకోవడానికే ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు బ్యాంకులో డబ్బులు వేసినా, తీసినా చార్జీలు వసూలు చేస్తూ ఆగ్రహం తెప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఛార్జీల నుండి కాస్త విముక్తి కలిగించడానికి వీలుగా ఓ యాప్ ను తీసుకొచ్చారు. అదే ఆధారిత పే యాప్. ఈ యాప్ ను ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా  నగదు చెల్లింపులపై ఎలాంటి చార్జీలు ఉండవు. ఈ యాప్ ఉంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏదీ అవసరం లేదు. దుకాణదారుడు ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. దాన్ని బయోమెట్రిక్ లేదా ఫింగర్‌ప్రింట్ స్కానర్‌కు కనెక్ట్ చేయాలి. కొనుగోలుదారుడు తన ఆధార్ నంబర్‌ను అందులో నమోదు చేసి, బ్యాంకును సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇక నగదు చెల్లించడమే తరువాయి. ఈ యాప్ ద్వారా చెల్లింపులు జరిపితే ఎలాంటి ట్రాన్షాక్షన్ ఫీజులు ఉండవు.