'నాయక్' గండి బాబ్జీ పై వైసీపీ ఫైర్
Published on: Thu Jan 10, 2013 10:45AM

రామ్‌చరణ్ 'నాయక్' మూవీలో విలన్ పాత్ర పేరుపై వివాదం నెలకొంది. ఆ సినిమాలో విలన్ రాహుల్‌దేవ్ పాత్రకు 'గండి బాబ్జీ' అని పేరు పెట్టడంపై మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన గండి బాబ్జీ వెంటనే చిత్ర దర్శకుడు వి వి వినాయక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. విలన్ పాత్రధారికి తన పేరు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకపోతే సినిమా థియేటర్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
రానున్న ఎన్నికల్లో పెందుర్తి స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశంతో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు.. కేంద్ర మంత్రి చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుగా పెట్టుకుని నాయక్ చిత్రంలో తన పేరును విలన్ పాత్రధారికి పెట్టించారని మండిపడ్డారు.


