TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పాలు, కూరగాయలు అమ్మి బతుకుతున్నాం..

Published on: Thu Mar 9, 2017 3:27PM

 

టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆస్తుల వ్యవహారంపై వివరణ ఇచ్చారు. ఎవరు అడగకున్నా ఆరేళ్లుగా ఆస్తుల వివరాలు వెల్లడిస్తున్నాము..దేశంలో ఏ రాజకీయ పార్టీ మాలాగ ఆస్తుల వివరాలు ప్రకటించలేదు... ఆస్తుల ప్రకటన సవాల్ ను జగన్ ఎప్పుడూ స్వీకరించలేదు అని అన్నారు. మానాన్నకు ఉన్న హరిటేజ్ షేర్లను నాకు రాసిచ్చారు.. 23 లక్షల హరిటేజ్ షేర్లు ఉన్నాయి. 2010 లో రూ. 110 ఉన్న షేర్ 2015 నాటికి రూ.1000కి చేరింది... హరిటేజ్ షేర్ల విలువ పెరగడంతో మా ఆస్తి విలువ పెరిగింది అని అన్నారు. హరిటేజ్ షేర్ ధర రూ.2 వేలకు పెరగడానికి ఇరవై ఏళ్లు పట్టింది... కానీ జగన్ కంపెనీ షేర్లు 12 నెలల్లోనే భారీగా పెరిగాయి అని ఎద్దేవ చేశారు. పాలు, కూరగాయలు అమ్ముకొని బతుకుతున్న కుటుంబం మాది.. ఆస్తుల విషయంలో కొందరు కావాలనే నాపై దుష్ర్పచారం చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు.