బీచ్ లో 'గ్రీకువీరుడు' ఆడియో
Published on: Thu Mar 7, 2013 2:23PM
.jpg)
కింగ్ అక్కినేని నాగార్జున 'సంతోషం' తరువాత డైరెక్టర్ దశరథ్ తో చేస్తున్న మూవీ 'గ్రీకువీరుడు'. అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఏంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 23న ఆడియోను ఆర్.కే.బీచ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితం రిలీజైన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నాగ్ న్యూలుక్ తో మన్మధుడులా ఉన్నారని అన్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఓ ఎన్నారై బిజినెస్ మేన్ గెటప్ లో కనిపించనున్నారు. నయనతార, మీరా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'గ్రీకువీరుడు' తో నాగ్ న్యూ ట్రెండ్ ని సృష్టిస్తాడని ఆయన అభిమానులు అంటున్నారు.


