ములాయంకు షాకిచ్చిన కొత్త ఎమ్మెల్యేలు..

 

మొన్నటివరకూ కొడుకే ములాయంకు షాకుల మీద షాకులు ఇవ్వగా.. ఇప్పుడు తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఆయనకు షాకులివ్వడం మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎస్పీ పార్టీ నుండి 47 మంది ఎమ్మెల్యులు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు  ఓ సమావేశం ఏర్పాటుచేసి, వాళ్లకు భోజన ఏర్పాట్లు చేద్దామనుకున్నారు. కానీ ఈ సమావేశానికి వెళ్లకుండా డుమ్మా కొట్టారు. అంతేకాదు తాము ఉండబోయేది అఖిలేష్ యాదవ్‌తోనే అని తేల్చిచెప్పేశారు. దాంతో చిన్నబుచ్చుకున్న పెద్దాయన.. తాను ఏర్పాటుచేసిన సమావేశాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అఖిలేష్ యాదవ్ ఏర్పాటుచేసే సమావేశాలకు మాత్రమే వెళ్లాలి తప్ప పార్టీ తరఫున మరెక్కడికీ వెళ్లకూడదని సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే లలాయ్ సింగ్ ఇందుకోసం ఏర్పాటుచేసిన సమావేశంలో చెప్పారంట. కాగా జనవరి వరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించిన ములాయం నుంచి.. అఖిలేష్ యాదవ్ ఆ పదవి లాగేసుకున్న విషయం తెలిసిందే.