TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముద్రగడ ఎందులో సక్సెస్ అయ్యారు..?

Published on: Wed Jun 22, 2016 11:52AM

 

ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఈరోజుతో సక్సెస్ ఫుల్ గా పద్నాలుగో రోజుకి చేరుకుంది. ఈరోజు ఆయన ఆయన దీక్ష విరమించనున్నారు. అయితే దీక్ష ఆయన సక్సెఫుల్ గా చేశారు కానీ.. ఆయన అనుకున్నది సక్సెస్ ఫుల్ గా సాధించారా అంటే అది ఆయనకే సమాధానం దొరకని ప్రశ్నగా మారింది. ఆయన దీక్ష ప్రారంభించిన రోజు ఏదో హడావుడి ఉండగా.. ఆతరువాత ఈరోజు దీక్ష విమరించే రోజు మాత్రమే హడావుడి కనిపిస్తుంది తప్ప ఈ పద్నాలుగు రోజులు ముద్రగడ దీక్ష గురించి పెద్దగా పట్టికున్నవారు కూడా లేరు. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఏదో నామ్ కే వాస్త్ రెండు రోజులు హడావుడి చేసింది తప్ప.. ఆతరువాత చేసుకుంటే చేసుకోండి అన్నట్టు ఊరుకుంది.

 

ఈ దీక్షలో భాగంగా చంద్రబాబు కూడా ముద్రగడతో బాగానే ఆడుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ముద్రగడ అనుకున్నది ఏ ఒక్కటీ జరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేశారు. ముందు పోలీస్ స్టేషన్లో నిరసన తెలిపిన ఆయనను వ్యాన్ లో కూర్చోపెట్టారు. వ్యాన్ లో దీక్ష అంటే ఇంట్లోకి వెళ్లేలా చేసారు. ఇంట్లో దీక్ష అంటే తీసుకెళ్లి ఆసుపత్రిలో వుంచారు. దీక్షను పట్టించుకోవడం మానేసారు. అంతేనా ఇక మీడియా సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఏ చిన్న విషయం అయినా ఊదరగొట్టే మీడియా ముద్రగడ దీక్ష గురించి మాత్రం పెద్దగా పట్టించుకున్నది లేదు. ఆ దరిదాపులకు కూడా వెళ్లలేదు. ఆఖరికి మద్దతుగా వచ్చిన దాసరి, చిరుల మీద టార్గెట్ చేశారు. ఇలా ఎక్కడికక్కడ కట్టడి చేసి, దీక్ష చేసుకుంటే చేసుకోమన్నారు. పోనీ దీక్ష విరమించేదుకు ముద్రగడ కొన్ని షరతులు పెట్టారు. అది కూడా చేశారా అంటే చేయలేదు. అది తననూ, జైలు నుంచి విడుదలైన 13 మందినీ పోలీసు వ్యాన్ లో కిర్లంపూడికి తీసుకువెళ్లాలని, అక్కడికి కలెక్టర్, ఎస్పీలు వచ్చి నిమ్మరసం ఇవ్వాలని ముద్రగడ డిమాండ్ చేశారు. దానికి కూడా ప్రభుత్వం నో చెప్పి ఇక ఇంటికెళ్లి దీక్ష విరమించండి అని సూచించింది. ఇక చేసేది లేక ముద్రగడ తమ వాహనంలోనే కిర్లపూడికి చేరుకున్నారు. ఇలా ముద్రగడ కోరింది ఏదీ జరగకుండానే ఆయన దీక్ష విరమించేలా చేశారు.

 

ఆయన అనుకున్నది జరిగిందల్లా నిందితులు బెయిల్ మీద రావడం. మరి వారికి బెయిల్ ముద్రగడ దీక్ష చేసినా వచ్చేది.. చేయకపోయినా వచ్చేది. కాకపోతే దానికి కొంత సమయం పట్టేది. దానికోసం ముద్రగడ దీక్ష చేపట్టారు. అయితే అంతా బానే ఉంది కానీ.. బెయిల్‌పై విడుదలైన నిందితులపై కొత్తగా కేసులు నమోదైతే, వారు మళ్ళీ అరెస్టయితే ముద్రగడ ఇంకోసారి దీక్ష చేస్తారా.? నిందితుల విడుదల కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ, కాపు రిజర్వేషన్ల ఉద్యమం కోసం ఏం చేస్తారు.? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇప్పటికే ముద్రగడ దీక్షను పట్టించుకోని వాళ్లు.. ఇకపై భవిష్యత్తులో మాత్రం పట్టించుకుంటారా అన్నది సందేహం..