తృణమూల్ ఎంపీల తుంటరితనం.. గది కోసం రగడ..
Published on: Tue Aug 12, 2014 4:34PM

పార్లమెంట్ ఆవరణలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తమ తుంటరితనం ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ కోసం పార్లమెంట్‌లో కేటాయించిన కార్యాలయాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి స్పీకర్ కేటాయించిన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు కార్యాలయం బయట వున్న తెలుగుదేశం పార్టీకి చెందిన బోర్డులను కూడా పీకేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలకు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలకు మధ్య వాగ్వాదం జరిగింది. తమకు కార్యాలయం కావాలంటే స్పీకర్ని సంప్రదించాలిగానీ, ఇలా ఇతర పార్టీలకు చెందిన కార్యాలయాల మీద దాడి చేసి బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు న్యాయమని తెలుగుదేశం ఎంపీలు ప్రశ్నిస్తున్నారు.


