హరికృష్ణ రాజీనామా ఆమోదం: ఎంపీలకు షాక్

 

 

 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టిడిపి పార్టీ ఎంపీ హరికృష్ణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పిజే కురియన్ ఆమోదించారు. తన రాజీనామాను ఆమోదించినందుకు హరికృష్ణ డిప్యూటీ ఛైర్మన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసినందుకు గర్వపడుతున్నానని ఆయన అన్నారు. అన్నగారి ఆశయ సాధన కోసమే రాజీనామా చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ వల్లే తనకీ పదవి దక్కిందని ఆయన చెప్పారు. తనను రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

 


అయితే ఇది సమైక్య రాష్ట్రం కోసం చేసిన తొలి రాజీనామా అవుతుంది. దీంతో ఇప్పుడు మిగిలిన సీమాంద్ర ఎమ్.పిలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. రాజ్యసభలోను, లోక్ సభలోను ఆందోళన చేస్తున్న ఎమ్.పిలు రాజీనామా చేయాలని ఇప్పటికే ప్రజలలో డిమాండ్ ఉంది. ఎపి ఎన్.జి.ఓల సంఘం అయితే ఎమ్.పిలు రాజీనామా చేస్తే తమ ఆందోళన విరమించుకుంటామని ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఇది కొత్త టర్న్ తీసుకున్నట్లవుతుంది. మిగిలిన ఎమ్.పిలు కూడా రాజీనామా చేస్తారా? లేదా అన్నది చర్చనీయాంశం అవుతుంది.