ఎమ్మెల్యే పదవికి మోపిదేవి రాజీనామా

 

Mopidevi Resigned, Mopidevi Venkataramana Rao quits as MLA

 

 

మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణరావు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడ జైలులో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దీక్షకు సంఘీభావంగా మోపిదేవి ఈ రోజు తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. మోపిదేవి తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్లో జైలు అధికారులకు అందజేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అధికారులు పంపించనున్నారు. తాను జైలులో ఉన్నందు వల్లనే ఇలా లేఖ పంపాల్సి వచ్చిందని మరో లేఖలో స్పీకర్‌కు మోపిదేవి వివరించారు.

 


మోపిదేవి రాజీనామా గుంటూరులో కలకలం రేపింది. జగన్ దీక్షకు మోపిదేవి ఈ రోజు సంఘీభావం తెలిపారు. జగన్ బ్యారెక్‌కు వెళ్లి తన మద్దతును ప్రకటించారు. జగన్ ఆదివారం ఉదయం నుండి దీక్ష చేస్తున్నారు. కాగా, జగన్ దీక్షకు సంఘీభావంగా మోపిదేవి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన జగన్ వైపు వెళ్లినట్లే!