ఘర్షణ పై స్పీకర్ కు పిర్యాదు

 

Mlas clash Telangana Bill, Ysrcongress, TDP Nannapaneni, telangana issue

 

 

అసేంబ్లీ ఆవరణలో తెలంగాణ ముసాయిదా బిల్లు పత్రాలను చించేసిన సమయంలో తెలంగాణ ప్రాంత నేతలే కాకుండా..తెలంగాణ జర్నలిస్టులు కూడా తమ మీద దాడి చేశారని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ రోజు శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టిన నేపథ్యంలో వారు ఆ ప్రతులను చించి తగులబెట్టారు. ఈ సంధర్భంగా అసేంబ్లీ మీడియా పాయింట్ వద్ద పెద్ద గందరగోళం చెలరేగింది.అయితే వీడియో ఫుటేజ్ ల ఆధారంగా తాను చర్యలు తీసుకుంటానని స్పీకర్ వారికి హామీ ఇచ్చారు.


ఇక శాసనమండలిలోనూ తెలంగాణ బిల్లు ప్రతులు టీడీపీ ఎమ్మెల్సీలు చించడంతో తోపులాట జరిగింది. ఈ సంధర్భంగా నన్నపనేని రాజకుమారి కిందపడిపోయింది. శాసన మండలి ఆవరణలోనే తమకు రక్షణ లేకుంటే.. తెలంగాణ ఏర్పడ్డాక తమ ప్రాంత ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని కోరుతూ ఆమె మండలి చైర్మకు ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మీద పిర్యాదు చేశారు. అనుకోకుండా జరిగిన ఘటనలో టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి క్రింద పడిపోయారని, ఈ సంధర్భంగా నా నుండి ఇబ్బంది కలిగినట్లు భావిస్తే దానికి తాను పశ్చాత్తాప పడుతున్నట్లు ఆయన తెలిపారు.