TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెల్ ఫోన్ తీసుకుందని పసిబిడ్డకు ఇంత శిక్షా!

Published on: Mon Jun 23, 2025 8:38PM

 

 

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం కాకర్ల దిబ్బలో ఫోన్ దొంగిలించిందనే ఆరోపణలతో బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు. బాలిక పరిస్థితి చూసి చలించిపోయిన ఎమ్మెల్యే.. బాలిక బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులను వెంటనే ఆ చిన్నారిని అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్లి మెరుగైన వైద్యం ఇప్పించాలని ప్రశాంతి రెడ్డి స్థానిక నాయకులను ఆదేశించారు.

ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక నాయకులు కమలాకర్ రెడ్డి వెంటనే ఆ చిన్నారిని  చికిత్స నిమిత్తం అపోలో హాస్పిటల్ కి తరలించారు. ఈ అఘాయిత్యన్నికి పాల్పడిన పినతల్లి మాణిక్యం నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ ఫోన్ దొంగతనం చేశానని..గెంటితో ఒళ్లంతా కాల్చి కొట్టారు.చిన్నారి తల్లి వెంకట రమణమ్మ పాపని చిన్నప్పుడే సన్నారి మాణిక్యం దగ్గర వదిలేసి వేరే భర్తతో వెళ్లిపోయినట్టు సమాచారం. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారిస్తున్నరు.