త్వరలో మంత్రి వర్గ విస్తరణ ?
Published on: Wed Jul 25, 2012 4:21PM
దేశంలోని ఏ సమస్యకైనా పరిష్కారం ప్రణబ్ ఎన్నిక తర్వాతే నని తేల్చి చెప్పిన అధిష్టానం ఇప్ఫుడు ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ దర్బారంతా రాష్ట్రపతి ప్రమాణోత్సవంలో కోలాహలంగా ఉంది. అయితే రాజస్థాన్, మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ తమ రాష్ట్రాలలో నాయకత్వ మార్పుకోసం డిల్లీలో కుస్తీపడుతున్నారు. ఇదే అదనుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌నాయకులంతా ఢిల్లీలో తిష్టవేశారు.
తెలంగాణ, ఆంధ్ర నాయకులు బలాబాలాలు బేరీజులో భాగంగా తెలంగాణ నుండి ముఖ్యమంత్రిగా కోరుతున్న వారిలో జానారెడ్డి, పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ అక్కడే వున్నారు. అయితే ప్రణబ్ ప్రమాణస్వీకారంతరం అజాద్ ముఖ్యమంత్రితో బేటీ అవుతారని తెలుపుతుండటంతో రాష్ట్రంలో నాయకత్వం మారుతుందా లేక మంత్రివర్గ విస్తరణకే ప్రాధాన్యత ఇస్తారా అనేది తేలనుంది. నాయకగణం అంతా మంత్రివర్గ విస్తరణే అంటున్నారు. ఢిల్లీలో మన నేతలంతా మాట్లాడుకునే అంశం మాత్రం చిరంజీవికి త్వరలో మంత్రిస్దానం లభించబోతోందనే . ఇదివరలో రోశయ్యను మంత్రి వర్గంనుండి తొలగించేటప్పుడు కూడా ఇదే విదంగా 15 రోజుల ముందు ఢిల్లీకి పిలిపించారు కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. దీనికి తోడు రాష్ట్ర గవర్నరు కూడా కిరణ్ సర్కార్ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటూ ఇక్కడి నాయకులు, మంత్రులు గవర్నర్ ను కలసిన వారు తెలియజేస్తున్నారు. ఇప్పడు గవర్నర్ కూడా అక్కడే ఉండడంతో రాష్ట్ర ప్రజలంతా ఉత్కంఠతో ఏ మార్పులు చేర్పులు జరుగుతాయోనని ఎదురు చూస్తున్నారు.


