మక్కా మసీదు పేలుడు కేసు తీర్పు.. కేసు కొట్టివేత..


మక్కా మసీదు కేసులు ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. ఆధారాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ తెలుపుతూ....నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చింది. దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మ, ఆసిమానంద, భారత్, రాజేందర్ చౌదరి అనే ఐరుగురు నిందితులను నిర్దోషులుగా తెలిపిన కోర్టు.... కేసును కొట్టేసింది. 11 ఏళ్ల క్రితం 2007 మే 18న మధ్యాహ్నం చార్మినార్‌ సమీపంలోని మక్కామసీదు ప్రాంగణంలోని వజూఖానా వద్ద ఐఈడీ బాంబ్ పేలడంతో తొమ్మిది మంది మృతిచెందగా.. 58 మంది గాయపడిన సంగతి తెలిసిందే.