గోవా సీఎంగా పారికర్ ప్రమాణ స్వీకారం..
Published on: Tue Mar 14, 2017 5:23PM
.jpg)
గోవా సీఎంగా మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగోసారి గోవా ముఖ్యమంత్రిగా పారికర్ ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. పరీకర్‌తో పాటు మొత్తం 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎంజీపీ, జీఎఫ్‌పీలకు చెందిన ఇద్దరిద్దరు, స్వతంత్రులు ఇద్దరు, బీజేపీ నుంచి మరో ఇద్దరు ఉన్నారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా, నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు హాజరయ్యారు. కాగా 40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఇతరులు పది స్థానాలు గెలుపొందిన సంగతి తెలిసిందే.


