మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్..
Published on: Tue Mar 21, 2017 6:12PM
.jpg)
నారద స్టింగ్ ఆపరేషన్ విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నారద స్టింగ్ ఆపరేషన్ పై సీబీఐ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించగా.. దానిని నిలిపివేయాలంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన, సుప్రీంకోర్టు.. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో సీబీఐ విచారణకు ఇక ఎలాంటి అడ్డు ఉండే అవకాశం దాదాపు లేకుండా పోయింది. గత ఏడాది మార్చి నెలలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు నారదా న్యూస్ చానల్ రెండు సీడీలను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ సీడీల్లో కొంతమంది టీఎంసీ నాయకులు లంచాలు తీసుకుంటున్న వ్యవహారం బయటపడింది.


