అన్నపూర్ణ లో మహేష్ '1'
Published on: Wed Sep 11, 2013 2:15PM

మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "1-నేనొక్కడినే". ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టుడియోలో జరుగుతుంది. ఈ షెడ్యుల్ సెప్టెంబర్ 16వ తేదీలోపు పూర్తి చేసుకొని తర్వాత షెడ్యుల్ సెప్టెంబర్ 27 నుండి బ్యాంకాక్ లో ప్రారంభం కానుంది. 14రీల్స్ బ్యానర్ లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు.


