సభలో గందరగోళం... 19 మంది ఎమ్మెల్యేలు సస్పెండ్..
Published on: Wed Mar 22, 2017 12:11PM

సభలో గందరగోళం సృష్టించిన ఎమ్మెల్యేలపై వేటు పడింది. ఈ ఘటన మహారాష్ట్రలో నెలకొంది. వివరాల ప్రకారం... మహారాష్ట్ర శాసనసభలో ఈ నెల 18న రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ బడ్జెట్ ప్రవేశపెడుతుండగా కాంగ్రెస్, ఎన్సీపీ తదితర విపక్ష సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. బడ్జెట్ ప్రతులు చదువుతున్న సమయంలో మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అక్కడితో ఆగకుండా బడ్జెట్ ప్రసంగం వినపడకుండా గట్టిగా నినాదాలు చేశారు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ హరిభావ్ బాగాడే 19 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 నెలల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


