TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జయలలిత కుమారుడు... అరెస్ట్ చేయండి..

Published on: Mon Mar 27, 2017 3:52PM


తాను జయలలిత కుమారుడినని.. తనవద్ద ఆధారాలు ఉన్నాయని..  జయ ఆస్తులకు అసలైన వారసుడిని తానే అని చెప్పి గత కొద్ది రోజుల క్రితం జె.కృష్ణమూర్తి అనే ఓ వ్యక్తి హంగామా చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు దానికి సంబంధించిన పత్రాలను కూడా కోర్టులో సమర్పించాడు. అయితే అవి అసలైనవా... లేక నకిలీవా అని తేల్చాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు దీనిపై విచారించిన మద్రాసు హైకోర్టు కృష్ణమూర్తిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశించింది. తాను జయలలిత కుమారుడినంటూ కృష్ణమూర్తి  సమర్పించిన డాక్యుమెంట్లన్నీ నకిలీవే అని పోలీసులు స్పష్టం చేయడంతో అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.