TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోకేష్... లో పర్ఫామెన్స్ ప్రదర్శిస్తున్నారా?

Published on: Thu Sep 29, 2016 12:07PM

లోకేష్.... టీడీపీలో తిరుగులేని పేరు! చంద్రబాబు తరువాత అంత పవర్ ఫుల్ కూడా! కాని, లోకేష్ పార్టీ కోసం చురుగ్గా పని చేయటం లేదా? ఈ మాట స్వయంగా చంద్రబాబే అన్నారా? అవును అన్నారు!
లోకేష్ కూడా ముందులా చురుగ్గా పని చేయటం లేదు. ఏదైనా పని చెబితే వెంటనే పూర్తి చేయటం లేదు అన్నారట ముఖ్యమంత్రి! ఇలా ఎందుకు అన్సాల్సి వచ్చిందీ అంటే... పార్టీ నేతల్ని ఉద్దేశించి ఆయన దిశా నిర్దేశనం చేస్తు అలా అన్నారు. అంతే కాదు, లోకేష్ ను కూడా మన్నించనప్పుడు మిగతా ఎవ్వర్నీ క్షమించేది లేదని చంద్రబాబు ఈ రకంగా తేల్చేశారు!
రాష్ట్ర విభజన తరువాత తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది టీడీపీ. అయితే, మొదటి రెండున్నర ఏళ్లు చంద్రబాబు కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని వంటి అంశాల మీదే దృష్టి పెట్టారు. పార్టీపై సరిగ్గా కాన్సన్ ట్రేషన్ చేయలేదు. కాని, 2019 ఎన్నికలకి ఒక్కో నెలా తగ్గుతుండటంతో ఇప్పుడు ఆయన పార్టీ పటిష్టతపై కూడా దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు పదే పదే పార్టీ మీటింగ్ లు పెడుతున్నారు. చిన్న , పెద్దా నేతలందరితో చర్చలు జరుపుతూనే వున్నారు. 
త్వరలో నగర, పుర పాలక ఎన్నికలు కూడా నిర్వహించాల్సి వుండటంతో అందు కోసం కూడా పార్టీని సిద్ధం చేస్తున్నారు బాబు. అధికారంలో వుండి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటకపోతే అది తప్పుడు సంకేతాలు పంపుతుంది. అలాగే, పార్టీ వచ్చే సాధారణ ఎన్నికలకి ఎంతలా తయారుగా వున్నది కూడా ఈ ఎన్నికల్లో తెలుస్తుంది. అందుకే, టీడీపీ చీఫ్... కార్యకర్తల్ని, నేతల్ని అందర్నీ ఏక కాలంలో ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు... 
లోకేష్ గతంలో లాగా చురుగ్గా వుండటం లేదన్న చంద్రబాబు మాటని మరి యువనేత ఎలా తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే ఆయన్ని నెక్స్ట్ టీడీపీ చీఫ్ అండ్ ఆంద్రా చీఫ్ మినిస్టర్ గా చూస్తున్నారు పార్టీలోని వారు. ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని , తండ్రి అంచనాల్ని లోకేష్ అందుకోవాలంటే మరింత కష్టపడాల్సిందే...