బిజెపి కి అద్వాని రాజీనామా!

posted on: Jun 11, 2013 12:22PM

 

 

 

 

బి. జె. పి. కురువృద్ధుడు ఎల్ . కె. అద్వాని ఆ పార్టీలోని తన అన్ని పదవులకు రాజీనామా చేశారు. బి. జె. పి తరఫున మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగించిన తక్షణం ఆయన ఇలా రాజీనామా చేయటం దేశ ప్రజలందరిని ఒకింత విస్మయానికి గురి చేసింది. అద్వాని తన రాజీనామా లేఖలో నేడు వ్యక్తుల సొంత ఎజెండాతో నడుస్తున్న పార్టీయే గాని,నాడు శంకరముఖర్జీ,వాజిపేయి ల నాటి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ కాదు అని పేర్కొనడం జరిగింది. అంటే ఇది పరోక్షంగా నరేంద్ర మోడీ ని గురించిన వ్యాఖ్యానమనే అనుకోవచ్చా?

 

 

google-ad-img
    Related Sigment News
    • Loading...