చవకబారు రాజకీయం వద్దు మన్మోహన్ జీ
Published on: Fri Aug 31, 2012 11:34AM
ప్రథాని తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. తన పరువును కాపాడుకోవడంకోసం రాజ్యాంగబద్దమైన సంస్థల పనితీరుని తప్పుపట్టడం సరైన పద్ధతి కాదని వామపక్షాలు మండిపడుతున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలకోసం కాస్తోకూస్తో నిబద్ధతతో పనిచేస్తున్న సంస్థలపై ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరిస్తున్నాయి. ఆడలేక మద్దెల ఓడిదన్నట్టు ప్రజలపక్షాన నిలబడి నిలదీసే కాగ్ ని, తమ తప్పులు కప్పిపుచ్చుకోవడంకోసం భ్రష్టుపట్టించడం సరైనపని కాదంటూ గురుదాస్ దాస్ గుప్తా తీవ్రస్థాయిలో ప్రథానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్మోహన్ లాంటి వ్యక్తికి ఇలాంటి చౌకబారు ప్రచారాలు తగవన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజలు అంతా స్పష్టంగా చూస్తున్నారన్న నిజాన్ని తెలుసుకోవాలని వామపక్షనేతలు అంటున్నారు. కిందిస్థాయినుంచి మంత్రుల స్థాయివరకూ పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేయడం చాతకాకపోతే పదవినుంచి తప్పుకోవాలని హెచ్చరించారు.


