దాణా స్కాం కేసులో లాలూకు ఐదేళ్ల జైలుశిక్ష

 

 

 

దాణా కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడి) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్ళు శిక్షపడింది. ఆయనకు పాతిక లక్షల జరిమానా కూడా విదించింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రాకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు శిక్షను ఖరారు చేసింది.


దాణా కుంభకోణం కేసులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఒకరు కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ మిశ్రా. రెండో వారు లాలూ ప్రసాద్ యాదవ్. మొత్తం రూ.950 కోట్ల కుంభకోణంలో లాలూ సిఎంగా ఉన్న సమయంలో ఇతను రూ.35 కోట్లకు పైగా కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి.