బీజేపీలోకి కృష్ణంరాజు
Published on: Mon Oct 28, 2013 3:03PM

ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి కృష్ణంరాజు తిరిగి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఉదయం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో కృష్ణంరాజు సమావేశమయ్యారు. కృష్ణం రాజు రెండున్నర నెలల క్రితం హైదరాబాదుకు వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఇప్పుడు రాజ్‌నాథ్‌ను కలిశారు. కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణం రాజు తిరిగి పాతగూటికి దగ్గరవుతున్నారు.
గతంలో బీజేపీ తరపున పోటీచేసి రెండు సార్లు ఎంపీగా గెలిచిన కృష్ణంరాజు 1999-2004 వరకు కేంద్ర రక్షణ శాఖ సహాయక మంత్రిగా కొనసాగారు. అనంతరం బీజేపీ నుంచి వైదొలిగిన చాలాకాలం తర్వాత తిరిగి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


