కొండా సురేఖకు వై.కా.పా.ఎమ్మెల్సీ సీటు?
Published on: Sat Jun 23, 2012 3:21PM
కేవలం 1500ఓట్లు ఎమ్మెల్యే కావాల్సిన తాజామాజీ రాతను మార్చేశాయి. ఈ లైను చదవగానే పరకాల అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండాసురేఖ గుర్తుకువస్తారు. ఈమె తన సమీప ప్రత్యర్థి తెరాస చేతిలో అతితక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. అయితే 18అసెంబ్లీ స్థానాలకు వై.కా.పా. 15చోట్ల విజయం సాధించింది. అందరూ ఎమ్మెల్యేలుగా పదవీప్రమాణం చేస్తుంటే సురేఖ మాత్రం ఇంట్లోనే ఉండిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన విజయమ్మ సురేఖ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్లోని సురేఖ ఇంట్లో ఆమెను కలుసుకున్న విజయమ్మ ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారట. దీనికి సురేఖ కూడా సరేనన్నారట. దీంతో వై.కా.పా. తరుపున కొండా సరేఖ శాసనమండలికి వెళతారు. దాదాపు ఎమ్మెల్యేతో సమానంగా రాజ్యమేలే పదవి ఎమ్మెల్సీ. కాబట్టి సురేఖ గెలవకపోయినా ఎమ్మెల్యే స్థాయి లభించినట్లే. ఇలా సురేఖ కూడా ఆనందపడుతున్నారు.


