TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోడ్డు ప్రమాదం: కోదండరామ్ క్షేమం

Published on: Fri Jun 6, 2014 5:53PM

 

 

 

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యచరణ సమితి (తెలంగాణ జేఏసీ) ఛైర్మన్ కోదండరామ్ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కోదండరాం ప్రయాణిస్తున్న కారును హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కీసర సమీపంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి కోదండరామ్ ఎలాంటి గాయాలూ తగలకుండా క్షేమంగా బయటపడ్డారు.