కేరళ సీఎంకు సుప్రీంకోర్టు ఝలక్...

 

డీజీపీ టీపీ సేన్‌కుమార్‌ను కేరళ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. అయితే  దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు  గట్టి ఝలక్ ఇచ్చింది. తనను తొలగించిన నేపథ్యంలో తనను తిరిగి నియమించాలంటూ సేన్‌కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారించిన కోర్టు..  సేన్‌కుమార్‌ను మళ్లీ అదే పదవిలో నియమించాలని ఆదేశించింది.

 

కాగా జిషా హత్యకేసు, పుట్టింగల్ ఆలయంలో బాణసంచా పేలుడు దుర్ఘటన కేసులను సరిగా విచారించలేదంటూ 2016 మే నెలలో కొత్తగా వచ్చిన పినరయి విజయన్ ప్రభుత్వం సేన్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తీసేసి, అంతగా ప్రాధాన్యం లేని పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. కానీ ఆయన ఆ పదవిలో చేరకుండా కోర్టుకెక్కారు.