ఇక కెన్యా మగాళ్ళు ఎంతమందినైనా పెళ్ళాడొచ్చు!

 

 

 

ప్రస్తుతం కెన్యాలో మగాళ్ళందరూ ఆనందంతో గంతులు వేస్తున్నారు. ఎందుకంటే కెన్యాలో వున్న మగాళ్ళు ఎంతమందినైనా పెళ్ళి చేసుకోవచ్చని కెన్యా పార్లమెంట్ తాజాగా ఒక బిల్లును ఆమోదించింది. గతంలో కెన్యాలో మగాళ్ళు ఒక్క పెళ్ళి మాత్రమే చేసుకోవాలనే చట్టం అమలులో వుండేది. ఇప్పుడు పాత చట్టాన్ని చించేసి, కెన్యా మగాళ్ళు ఎంతమంది మహిళలనైనా పెళ్ళిచేసుకోవచ్చని కెన్యా పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టాన్ని మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మతపెద్దలు ఎంతగానో వ్యతిరేకించారు. అయినప్పటికీ కెన్యన్ పార్లమెంట్ ఈ వ్యతిరేకతని, అభ్యంతరాలని ఎంతమాత్రం పట్టించుకోకుండా కొత్తచట్టాన్ని ఆమోదించేసింది. దాంతో కెన్యా కుర్రాళ్ళు... సారీ... కుర్రాళ్ళేం ఖర్మ.. కాటికి కాళ్ళు చాపుకున్న ముసలోళ్ళు కూడా ఇంకా బోలెడన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలని లొట్టలు వేస్తున్నారు. అయితే ఈ చట్టం మహిళలకు మాత్రం మొండిచెయ్యి చూపించింది. కెన్యా మహిళలు కేవలం ఒక్క మగాడిని మాత్రమే పెళ్ళి చేసుకోవాలి. ఎంత అన్యాయం?