లక్ష మందితో స్వాభిమాన్ సదస్సు

Publish Date:Sep 10, 2013

Advertisement

 

 

 

త్వరలో హైదరాబాద్‌లో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. టీ. ఉద్యోగులతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22న ఎన్టీఆర్ స్టేడియంలో లక్ష మందితో తెలంగాణ స్వాభిమాన్ సదస్సు నిర్వహించాలని సమావేళంలో తీర్మానించినట్లు చెప్పారు.

 


ఈ నెల 12వ తేదీన జరగనున్న జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో సదస్సుపై వివరాలు ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు. ఎలాంటి ఆంక్షలు లేని హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ కావాలని ఆయన పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రజల కల సాకారం అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక తెలంగాణ వచ్చి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకునే తెలంగాణ సిద్ధించే వరకు పోరాటం కొనసాగుతుందని, వివిద పద్ధతుల్లో ఉద్యమం ఉంటుందని ఆయన తెలిపారు.  ఏపీఎన్జీఓల సభ అంత గొప్పదేమి కాదని ఆయన అన్నారు.కాంగ్రెస్ పెద్దలకు పది జిల్లాల సంపూర్ణ తెలంగాణనే ప్రజలు కోరుకుంటున్నారని వివరించానని చెప్పారు.