TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తల్లీ, బిడ్డకి కేసీఆర్ కిట్.. కేసీఆర్ కిట్ లో ఏముంది..?

Published on: Mon Mar 13, 2017 6:30PM

 

ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 2017-18 సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ లో ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. తల్లీ బిడ్డకి కేసీఆర్ కిట్ ఇవ్వబోతున్నారు. మహిళా శిశు సంక్షేమానికి మొత్తం రూ. 1731.50 కోట్లు కేటాయించారు.  గర్భిణీ స్త్రీలకు మూడు విడతల్లో రూ. 12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం కోసం చేరిన వెంటనే గర్భిణీ స్త్రీలకు రూ. 4 వేలు, డిశ్చార్జి అయ్యాక మరో రూ. 4 వేలు, పుట్టిన బిడ్డకు పోలియో టీకా వేయించుకోవడానికి వచ్చినప్పుడు మరో 4 వేలు అందించాలని నిర్ణయించామన్నారు. ఆడపిల్లను ప్రసవిస్తే అదనంగా మరో వెయ్యి రూపాయాలు ఇస్తామని ప్రకటించారు. ఇక పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం 16 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్‌ను ఇవ్వబోతున్నామని తెలిపారు. కిట్‌లో తల్లిబిడ్డకు ఉపయోగపడే సబ్బులు, బేబీ ఆయిల్, చిన్న పిల్లల పరుపు, దోమతెర, డ్రస్సులు, చీరలు, హ్యాండ్ బ్యాగు, టవళ్లు, నాప్కిన్స్, పౌడర్, డైపర్లు, షాంపు, పిల్లల ఆట వస్తువులుంటాయి.