కర్ణాటక గవర్నర్తో సదానందగౌడ భేటీ
Published on: Sat Jun 30, 2012 2:04PM
కర్ణాటక రాష్ట్ర గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజతో ముఖ్యమంత్రి సదానందగౌడ శనివారం ఉదయం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గవర్నర్కు వివరించినట్లు తెలిపారు. పార్టీలో నెలకొన్న సంక్షభాన్ని త్వరలోని అధిష్టానం పరిష్కస్తుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా రాజీనామా చేసిన తొమ్మిదిమంది మంత్రుల రాజీనామాలను ఆమోదించవద్దని బీజేపీ అధిష్టానం సదానంద గౌడను ఆదేశించింది.


