'కడలి' ఫస్ట్ రిపోర్ట్...మూవీ స్టోరీ
posted on Feb 1, 2013 5:38PM

షామ్ (అరవింద్ స్వామీ), బర్గ్ మన్ (అర్జున్ ) ఫాదర్ లు అవ్వాలని ఒక చర్చి లో చేరతారు. సడన్ గా ఒక రోజు బర్గ్ మన్ పై అనుకొని పరిస్థితుల్లో షామ్ కంప్లైంట్ చేస్తాడు. అప్పుడు అతను చర్చి నుంచి బయటకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కోపంలో వున్న బర్గ్ మన్, షామ్ పై పగ తీర్చుకుంటానని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు.
ఆ తరువాత షామ్ కి ఫాదర్ గా ఒక విలేజ్ లో పోస్టింగ్ వస్తుంది. ఆ ఉరిలో ఉన్న జనాలకు షామ్ దేవుడి గురించి చెబుతూ ఉంటాడు. ఈ సమయంలో అనాధ అయినా థామస్ (గౌతమ్ కార్తీక్ ) ని చేరదిస్తాడు. అనుకోకుండా ఒక రోజు షామ్, బర్గ్ మన్ ని కలుస్తాడు,దానితో అతను ఒక ప్రమాదంలో పడతాడు.
వీరి కధ జరుగుతుండగా థామస్, తులసిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అతనికి తులసి బర్గ్ మన్ కూతురు అని తెలుస్తోంది. అయితే బర్గ్ మన్ ను ఎదిరించి థామస్ తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు. షామ్ కి ఎలా సహాయపడతాడు అనేది మిగతా కధ.