TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండియన్స్ ఇడియట్ప్...కట్జూ క్షమాపణ చెప్పాలి

Published on: Tue Dec 11, 2012 8:55AM

 

Justice Katju sued, Justice Katju Indians idiots remark, Indians idiots remark Justice Katju Indians idiots

 

ఇండియన్స్ ను ఇడియట్ప్ అని అంటారా ? ఇది భారతీయులను అవమానించేలా ఉంది. వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పండి అని ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు జస్డిస్ మార్కండేయ కట్జూకు లక్నోకు చెందిన ఇద్దరు యువకులు తాన్యా ఠాకూర్, ఆదిత్య ఠాకూర్ లు నోటీసులు పంపించారు. భారతీయుల్లో 90 శాతం మంది ఇడియట్స్ అని కట్జూ అన్నారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు అందాయి.



నోటీసులు అందుకున్న కట్జూ తన బ్లాగులో వివరణ ఇచ్చుకున్నారు. నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని తట్టి లేపేందుకే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరిని కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నారు.  తొంభై శాతం మంది భారతీయులు ఇడియట్స్ అని, వారికి మెదళ్లు లేవని తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినో నొప్పించేందుకు కాదని పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల భారతదేశం వెనకబడి పోతుందని ఆ ఉద్దేశంతోనే అలాంటి వ్యాఖ్యలు చేశానని తెలిపారు.