ఎన్టీఆర్ సినిమాలు అడనివ్వం

 

 

 

తెలంగాణ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడకుండా అడ్డుకుంటామని ఓయు జెఎసి హెచ్చరించింది. ఎన్టీఆర్ సమైక్యవాదా లేక తెలంగాణవాదా చెప్పాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా టిడిపి ఎంపీ నందమూరి హరికృష్ణ రాజీనామా చేసిన నేపధ్యంలో ఓయు జెఎసి ఈ హెచ్చరికను జారీ చేసింది. హరికృష్ణ సమైక్యాంద్రకు మంద్దతుగా రాజీనామా చేసినందున ఆయన కొడుకు ఎన్.టి.ఆర్. సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని ఓయు జెఎసి హెచ్చరించింది. జూనియర్ తన అభిప్రాయం చెప్పకుంటే రామయ్యా వస్తావయ్య సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు.