TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ బెయిల్ పై జెపి స్పందన

Published on: Tue Sep 24, 2013 7:20PM

 

 

 

జగన్ కు బెయిల్ ఇవ్వడంలో తప్పేం లేదని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. జగన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఆయన స్పందించారు. జగన్‌కు బెయిల్ ఇవ్వడం పొరబాటు కాదని, ఓ వ్యక్తిని ఎల్లకాలం జైలులో ఉంచడం ద్వారా అవినీతిని నిర్మూలించలేమని జేసీ అభిప్రాయపడ్డారు. అవినీతి కేసులు కూడా నిర్భయ కేసంత తీవ్రమైనవే అన్నారు. అవినీతి కేసులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. అవినీతి కేసులో నేరం రుజువైతే వారి ఆస్తులను జఫ్తు చేయాలని డిమాండ్ చేశారు.