భారతీయుడికి 82 ఏళ్ల జైలు శిక్ష
Published on: Sun Jan 24, 2016 4:44PM

భారత్‌కు చెందిన అమన్‌దీప్ సింగ్ అనే వ్యక్తికి,అమెరికాలోనే ఉంటున్న మరో భారతీయుడు పరంజీత్‌సింగ్ తో వ్యక్తిగత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో పరంజీత్‌తో కలిసి 2008 ఆగస్టు 31న ఒక ఫంక్షన్‌కు హాజరైన సమయంలో ఇద్దరూ గొడవ పడ్డారు..ఆ గొడవలోనే పరంజీత్‌ను తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత అమన్‌సింగ్ భారత్‌కు పారిపోయాడు. ఈ కేసులో విచారణ చేపట్టిన అమెరికా పోలీసులు భారత అధికారులకు సమాచారమందించారు. దీంతో 2013లో పంజాబ్‌లోని జలంధర్‌లో అమన్‌దీప్‌ను పోలీసులు అరెస్ట్ చేసి అమెరికాకు హ్యాండ్ ఓవర్ చేశారు.ఈ కేసులో జనవరి 22న తుదితీర్పు ఇచ్చింది అమెరికా కోర్టు. అమన్‌దీప్‌ను దోషిగా గుర్తిస్తూ అక్కడి సక్రామెంటో కోర్టు 82ఏళ్ల జైలుశిక్ష విధించింది..


