TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్‌ పార్టీలో కుమ్ములాటలు?

Published on: Fri Aug 31, 2012 4:55PM

అధికారం రాకముందే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆ విభేదాలతో రచ్చకెక్కింది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాలని ఆందోళన చేపట్టిన నేతలు చివరికి రోడ్డుమీదే జుట్టూజుట్టూ పట్టుకుని కొట్టుకున్నారు. గుంటూరులో ఈ ఘటన జరిగింది. ఒక గ్రూపు అంబటి రాంబాబుది. రెండో గ్రూపు విజయభాస్కరరెడ్డిది. అంబటిరాంబాబుకు వ్యతిరేకంగా మరో గ్రూపుని నడుపుతున్న విజయభాస్కరరెడ్డి గుంటూరు జిల్లాలో మంచి పట్టు ఉన్ననేతగా పేరు సంపాదించుకున్నారు. వైకాపా కూడా తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలకు బాహాబాహీలోనూ, ముష్టిఘాతాల్లోనూ ఏ మాత్రం తగ్గదని ఈ ఘటన రుజువుచేసింది.