ఏపీ ఎన్జీవోలకు జగన్ అండ
Published on: Fri Jul 4, 2014 6:43PM
.jpg)
ఏపీ ఎన్జీవోల భూమిని స్వాధీనం చేసుకోవడంపై వైకాపా చీఫ్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్జీవోలకు కేటాయించిన 189 ఎకరాల భూములను తిరిగి ఇచ్చే వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఆ భూముల విషయంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా జగన్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ఎన్జీవో ఉద్యోగులు ఆ భూములను ప్లాట్లుగా విభజించుకుని, విద్యుత్, రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం కోట్లు ఖర్చు పెట్టారని ఆయన అన్నారు. ఎవరికైనా భూములు కేటాయించాలంటే ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం చూసుకోవాలని ఆయన అన్నారు. ఏపీ ఎన్జీవోలకు వైకాపా అండగా ఉంటుందని తెలిపారు.


