జగన్ దారి.. అడ్డదారి!

Publish Date:Nov 6, 2013

Advertisement

 

 

 

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డిని చూస్తుంటే రజనీకాంత్ గుర్తొస్తాడు. అంతేకాదు జగన్ని జగనీకాంత్ అని పిలుచుకోవాలని కూడా అనిపిస్తూ వుంటుంది. కాకపోతే ఒక్కటే తేడా ఏంటంటే, సినిమాలో రజనీకాంత్‌ ‘నాదారి రహదారి’ అంటాడు. రాజకీయాల్లో జగన్ మాత్రం ‘నా దారి అడ్డదారి’ అంటున్నాడు.

 

రాష్ట్రంలో విభజన చిచ్చు పెట్టింది దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అయితే, ఆ చిచ్చులో ఆజ్యం పోసి నిప్పు ఎగదోసింది మాత్రం జగన్మోహనరెడ్డి. తెలంగాణ వస్తే రాని, సీమాంధ్రలో నేనే హీరో అయిపోతా అనే ఆలోచనతో తెలంగాణకు మద్దతు ప్రకటించిన జగన్ విభజనకు ప్రధాన కారకుడు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు దారి వెతుక్కుంటున్న సమయంలో విభజన రథ చక్రాలు సులభంగా ముందు వెళ్ళడానికి జగన్ జాతీయ రహదారినే నిర్మించాడు.ఇప్పుడు అంతా అయిపోయాక తాను విభజనకు వ్యతిరేకమని అంటూ, రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. అంతా అయిపోతున్న తరుణంలో ఇప్పుడు రహదారుల దిగ్బంధం చేసి జగన్ బావుకునేదేమిటో అర్థం కాక రాజకీయ విశ్లేషకులు కూడా ఆలోచనలో పడుతున్నారు. రహదారులను దిగ్బంధించి జగన్ సీమాంధ్రుల అభిమానం పొందుతాడా అంటే, సీమాంధ్రుల దృష్టిలో పాతాళానికి పడిపోయిన జగన్‌కి ఆ ఛాన్స్ కూడా లేదు.మరి ఎందుకిలా తంటాలు పడుతూ రహదారుల దిగ్బంధం చేస్తున్నాలో, జనాన్ని ఎందుకు తంటాలు పెడుతున్నాడో జగన్ గారికే ఎరుక. అన్నట్టు... రాష్ట్ర విభజన కోసం తాను చేసినవన్నీ మర్చిపోయి ఇప్పుడు సమైక్యవాది ముసుగులో వున్న జగన్ మహాశయుణ్ణి ‘గజనీ’కాంత్ అని పిలుచుకోవచ్చు.

 

By
en-us Political News