TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సంక్షోభంలో సాక్షి, సిబ్బందికి ఈ నెల జీతాలు అనుమానమే

Published on: Sat May 19, 2012 6:15PM

సుమారు వెయ్యికోట్ల బ్యాంకు నిల్వలతో ప్రారంభమైన సాక్షి దినపత్రిక, సాక్షి టెలివిజన్ చానళ్ళు హఠాత్తుగా సంక్షోభంలో పడ్డాయి. సిబిఐ ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ రెండు సంస్థలకు చెందిన బ్యాంకు ఎక్కౌంటు లను స్తంభింపజేశారు. దీనితో ఈ సంస్థలు రెండు రోజుల క్రితం కొత్త ఎక్కౌంటు లను ప్రారంభించాయి. అయితే వాటిలో పెద్దగా లావాదేవీలు జరగడంలేదు. ప్రభుత్వం కొత్త ప్రకటనలు ఇవ్వడం ఇప్పటికే మానేసింది. ఇప్పటికే వచ్చిన ప్రకటనులు సంబంధించి సుమారు 50కోట్ల రూపాయల బకాయిలు ఇంకా చెల్లించలేదు. ఇవి ఇప్పట్లో వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇటివలి ఐ ఐ టి పలితాల అనంతరం నారాయణ శ్రీ చైతన్య వంటి సంస్థలు ఈ రెండు సంస్థలకు సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు ఇచ్చాయి. అయితే ఈ డబ్బు సాక్షి సంస్థల ఖర్చులకు ఏ మాత్రం సరిపోదు. సాక్షి దినపత్రికకు ఒక్కోదానికి సగటున 16 రూపాయల ఖర్చు అవుతుంటే మూడు రూపాయలకు మాత్రమే అమ్ముతున్నారు. ముద్రించే వాటిలో సుమారు 20శాతం అమ్ముడుపోవు. సాక్షి టెలివిజన్ ను నిర్వహణకు నేలకు సుమారు మూడుకోట్ల ఖర్చు అవుతోంది. ఆదాయం అందులో సగం కూడా రావడం లేదు. అయితే రిజర్వుఫండ్స్ ఉండడంతో ఇప్పటిదాకా వీటి నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కాని ఎక్కౌంట్స్ నిలిపివేయడం, ఆదాయం లేకపోడంతో వచ్చే నెల సిబ్బందికి ఎలా జీతాలు చెల్లించాల అన్న అంశంపై ఫైనాన్స్ డిపార్టుమెంట్ మల్లగుల్లాలు పడుతుంది. ఇతర మార్గాల ద్వారా డబ్బు వస్తే ఆది ఎలా వచ్చిందో సిబిఐ కు చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల అవసరమైతే జగన్ కుంటుంబ సభ్యులు, సన్నిహితులు నుంచి రుణాలు తీసుకోని సిబ్బంది జీతాలు చేలించాలనే యోచనలో ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఉన్నట్లు తెలిసింది. ఈ రెండు సంస్థల ఆస్తులను కూడా ఎటాచ్మెంట్ చేసి ప్రభుత్వం వీటి పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించబోతుంది. ఈ అధికారిని నియమించే లోగానే సిబ్బంది జీతాలకు ఏర్పాట్లు చేయాలనీ ఫైనాన్స్ డిపార్టుమెంట్ సిబ్బంది తొందర పడుతున్నట్లు తెలిసింది.

 

 

సాక్షి పత్రిక, న్యూస్ ఛానల్ సిబ్బందికి ఇతర సంస్తలు ఇస్తున్న దానికన్నా ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నారు. న్యూస్ పేపర్ హకర్లకు కూడా ఎక్కువ కమిషన్ ఇచ్చిన జగన్ ఒక సందర్భంలో జీతభత్యాలు, కమిషన్ల చెల్లింపు విషయంలో సాక్షిని ఆదర్శంగా తెసుకోవలంటూ ఈనాడు అధినేత రామోజీ రావుకు సలహా కూడా ఇచ్చారు.