TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సాక్షి ఖాతాల నిలిపివేత చెల్లదు: మాజీ మంత్రి గాదె

Published on: Wed May 9, 2012 5:32PM

jagan sakshi, sakshi CBI, Jagan CBI, minister gade sakshi jagan జగన్ మోహన్ రెడ్డి సాక్షి మీడియాకు చెందిన బ్యాంకు ఖాతాలను నిలిపివేయటంపై మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి నిర్మోహమాటంగా ఖాతాల స్తంభన చట్ట విరుద్దం, న్యాయవిరుద్దం అని స్పష్టం చేశారు.ఇప్పటికి మూడు ఛార్జీ షీట్లు జగన్ ఆస్తుల కేసులో వేశారని, ఒక్కోసారి ఒక్కొక్కరిని అదనంగా చేర్చుతున్నారని గాదె వ్యంగ్యంగా అన్నారు.సిబిఐ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనివల్ల జగన్ పట్ల కక్ష సాధిస్తున్నారన్న బావన వ్యాప్తిలోకి వస్తుందని హెచ్చరించారు.కరెంటు ఖాతాలో రోజువారి వచ్చే అమ్మకాల ఆదాయం, ప్రకటనల ఆదాయం, రోజువారి ఖర్చులు జీతాలకు సంబంధించిన విషయాలు ఉంటాయని,దీనికి పెట్టుబడులకు సంబంధం ఏమిటని గాదె ప్రశ్నించారు.,కాగా ప్రఖ్యాత జర్నలిస్టు కులదీప్ నయ్యార్ ,ఎమ్మెల్సీ నాగేశ్వర్ ప్రభృతులు సాక్షి బ్యాంకు ఖాతాల స్తంబించిన తీరును తప్పుపట్టారు. పత్రికా స్వేచ్చకు ఇది విరుద్దమని నయ్యర్ వ్యాఖ్యానించారు.కాగా జగన్ తనకు అరెస్టు తప్పదనే ఉద్దేశ్యంతోనే ఈ వ్యవహరంలో అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాడని తెలుగుదేశం నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. ఇప్పటికే జగన్ ను అరెస్టు చేసి ఉండవలసిందని ఆయన తెలిపారు.