TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రామ్ గోపాల్ వర్మను బెదిరించిన జగన్

Published on: Thu May 31, 2012 4:32PM

ప్రముఖ సినీ నిర్మాత, డైరెక్టర్ రాంగోపాల్ వర్మను జగన్ బెదిరించిన విషయం వెలుగులోకి వచ్చింది. రక్త చరిత్ర -2 సినిమాకు సంబంధించి కొన్ని సీన్లు తీసివేయాలని జగన్ నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని రాంగోపాల్ వర్మ అన్నాడు. దీనిపై లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ.. జగన్ నైజం అటువంటిదేనని, అతడు నేరస్తులతో చేతులు కలిపిన దాఖలాలు ఉన్నాయని ఆరోపించారు. రక్త చరిత్ర-2లో జగన్ పాత్రను చిత్రీకరిస్తే, ఆ పాత్రను తీసివేయాల్సిందిగా జగన్ తన సన్నిహితుడి చేత బెదిరింపులకు పాల్పడ్డారని వర్మే తనకు స్వయంగా చెప్పాడని లగడపాటి వెల్లడించారు.