TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సమైక్య శంఖారావ౦ వాయిదా!

Published on: Wed Oct 16, 2013 6:25PM

 

 

 

వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సమైక్య శంఖారావ సభను వాయిదా వేసే ఆలోచనలో వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 19న హైదరాబాద్ సమైక్య శంఖారావ సభ నిర్వహించేందుకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు మంజూరు చేసింది. అయితే సమయం తక్కువగా ఉన్నందున అదికారులను ఈ విషయమై సంప్రదించి అదేరోజు నిర్వహించడమా? లేక మరోరోజు కు వాయిదా వేయడంపై వైకాపా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 


సభ ఏర్పాటుకు కాస్త సమయం పడుతుందని, గడువు తక్కువ ఉండటంతో సభను మరో తేదీలో నిర్వహిస్తామని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి చెప్పారు. సంబంధిత అధికారుల అనుమతితో తాము తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలోనే సభను నిర్వహిస్తామన్నారు.