వై.కా.పా స్నేహం ఎవరితో?

 

 jagan congress, ysr congress bjp, jagan telangana, jagan release

 

 

రానున్న 2014 ఎన్నికల సందర్భం లో జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఐన వై.కా.పా ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనేది ఒక చర్చగా మారింది. జైలు నుండి బెయిల్ మీద విడుదల అనంతరం కాంగ్రెస్ తో కుమ్మక్కు అయ్యారనే ప్రచారం జోరుగా సాగింది. కాని ఢిల్లీ లో నిన్న రాష్ట్రపతిని కలిసిన విజయమ్మ సి.పి. ఎం జాతీయ నాయకుడు సీతారం ఎచూరిని కలవటం ద్వారా సి.పి. ఎం తో కూడా పొత్తుకు సిద్దపడుతున్న సంకేతాలు అందుతున్నాయి. అయితే మరోపక్క జైలు నుండి వచ్చిన అనంతరం ఒకసందర్భంలో నరేంద్ర మోడీ మంచి పరిపాలన దక్షుడని,కాకపోతే ఆయన మతతత్వ వాదం నుండి బయట పడితే బాగుంటుందని మరొక సంకేతాన్ని అంటే బి.జె.పి తో కూడా పొత్తు పెట్టుకోవచ్చు ననే భావాన్ని కూడా ప్రజలకు కలుగ చేశారు. ఈ మొత్తం సంకేతాల నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి కేంద్రం లో ఎవరు అధికారంలో కి వస్తే వారికి తన స్నేహ హస్తాన్ని అందిస్తారా?అది యు.పి. ఎ ప్రభుత్వమైనా లేక థర్డ్ ఫ్రంట్ ఐన సరే,అన్ని ద్వారాలు తెరచి స్నేహ హస్తం అన్ని పార్టీలకు అందించటానికి ఎదురుచూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.