సాకులు చెప్పబడును..

 

జగన్ కు ఈ మధ్య కాలం అస్సలు కలిసిరానట్టు ఉంది. ఏం పని మొదలు పెడుతున్నా అది సక్సెస్ కాకపోగా.. ఆఖరికి జగన్ కు విమర్శలే ఎదురవుతున్నాయి. ఇక ఆపై సాకులు వెతుక్కోవడం పరిపాటి అవుతుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామని... సీఎం అని కూడా చూడకుండా చంద్రబాబును నడిరోడ్డుపై ఉరి తీయాలని.. కాల్చిపారేయాలని.. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేశాడు జగన్ బాబు. ఆఖరికి ఏమైంది.. నంద్యాల ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. ఇక దానికి టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బులిచ్చారని.. అవినీతికి పాల్పడ్డారని ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు. దాని దెబ్బకి కాకినాడ ప్రచారంలో కూడా సరిగ్గా పాల్గొనలేదు జగన్. ఇప్పుడు మరోసారి పాదయాత్ర విషయంలో సాకులు చెపుతున్నాడు. ఇప్పటికే జగన్ పాదయాత్ర చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. ఆ ప్రయత్నాలు మాత్రం ఫలిచడంలేదు.

 

అక్రమాస్తుల కేసుల నేపథ్యంలో జగన్ ప్రతివారం కోర్టుకు హాజరవుతారు. అయితే దానిని తప్పించుకోవడానికి.. తాను పాదయాత్ర చేయాలనుకుంటున్నానని... తనకు మినహాయింపు ఇవ్వాలని హైకోర్టును కోరారు. కానీ కోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు. సీబీఐ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. మళ్లీ సీబీఐ ను ఆశ్రయించాడు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు తాను నవంబర్ 2 నుండి ప్రారంభించాలనుకున్న పాదయాత్రకు కూడా బ్రేక్ పడేట్టు కనిపిస్తోంది.  నవంబర్ 2 నుంచి మూడోవారానికి వాయిదా వేయాలని భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నవంబర్ రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభ జరిగినా పాదయాత్ర చేయాల్సిందేనని జగన్ మొండిపట్టు పట్టినా సీనియర్లు వద్దని గట్టిగా సలహా ఇచ్చారట. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. ఆరునూరైనా పాదయాత్ర చేస్తానని చెప్పిఇప్పుడు వెనక్కు తగ్గితే పరువు పోతుందేమోనని జగన్ గుంజుకుంటున్నారట. అయితే అసెంబ్లీలో అధికారపక్షాన్ని నిలదీయడానికే పాదయాత్ర వాయిదా వేసుకున్నానని కలరింగ్ ఇవ్వమని కూడా సీనియర్లు సలహా ఇచ్చారట.. నిజానికి జగన్ అండే కో బ్యాచ్ అసెంబ్లీకి వచ్చినా.. రాకపోయినా పెద్దగా ఒరిగేది ఏం లేదు.. గత మూడు సంవత్సరాల నుండి ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడేదో తప్పించుకోవడానికి అసెంబ్లీ అని చిన్న సాకు చెబుతున్నారన్న సంగతి రాజకీయ పరిజ్ఞానం కాస్త ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. మొత్తానికి జగన్ కు మాత్రం ఎప్పటికప్పుడు సాకులు ప్రెష్ గా భలే దొరుకుతున్నాయి.