జగన్ వైపు దోపిడీ దారులు

 

jagan, congress, kvp ramachandra rao, lagadapati rajagopal, tdp

 

 

రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులంతా జగన్ పార్టీలో చేరిపోతున్నారు. కేవీపీ రాంచంద్రరావు వియ్యంకుడు రఘురామకృష్ష్ణంరాజు, బాలశౌరిలు జగన్ పార్టీలో చేరారు. రేపో మాపో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా రేపో మాపో జగన్ పార్టీలో చేరబోతున్నాడు. సోనియాగాంధీకి కేవీపీ రాంచంద్రరావు మధ్యవర్తి అయితే కేవీపీకి పవర్ ఆఫ్ అటార్నీ రఘురామకృష్ణం రాజు అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.


విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆస్తి 2004లో తొమ్మిది కోట్లకు పైగా ఉంటే ఇప్పుడు 122 కోట్లకు ఎలా పెరిగిందని, జగన్ ఆస్తి 2004కు ఇప్పటికి ఇరవై వేల రెట్లు పెరిగిందని ఇలా దోపిడిదారులు, అవినీతి పరులు ఒకే పార్టీలో చేరిపోయి ముఠాగా మారుతున్నారని విమర్వించారు. రాజ్యాంగ విరుద్దంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిందని, ఈ విభజన కోర్టు ముందు నిలబడదని సోమిరెడ్డి అభిప్రాయ పడ్డారు. సీమాంధ్రకు చెందిన 19 మంది ఎంపీలు రాజీనామా చేస్తే యూపిఏ బలం 263కు పడిపోతుందని, రాజీనామాల విషయంలో లగడపాటి, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు దాగుడు మూతలు ఆడుతున్నారని అన్నారు.