TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఉక్కు మహిళకు ఘోర పరాభవం

Published on: Sat Mar 11, 2017 2:44PM

 

మణిపూర్‌ ఉక్కు మహిళకు చుక్కెదురైంది. ఓట్ల పండుగలో తీవ్ర పరాభవం ఎదుర్కొంది. సైనిక దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ పదహారేళ్లపాటు పట్టువదలకుండా దీక్ష చేసిన ఇరోమ్ షర్మిలకు మణిపూర్ ప్రజలు చుక్కలు చూపించారు. తౌబల్ నియోజకవర్గం నుంచి సీఎం ఇబోబీ సింగ్‌పై పోటీచేసిన ఇరోమ్‌ ‌డిపాజిట్్ గల్లంతు చేశారు. కనీసం వంద ఓట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ప్రజా హక్కుల కోసం పోరాటం చేసినా... తమకవసరం లేదంటూ పాత పార్టీలకే ప్రజలు పట్టం కట్టారు. అయితే కండీషన్స్‌తో దీక్ష విరమించడమే ఇరోమ్ ఓటమికి కారణంగా తెలుస్తోంది.