TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముంబైని గెలిపించిన రాయుడు

Published on: Thu Apr 26, 2012 9:30AM

పంజాబ్ కింగ్స్‌పై ఓడిపోతుందనుకున్న ముంబైని రాయుడు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. పంజాబ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో రాయుడు (17 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రాబిన్ పీటర్సన్ (7 బంతుల్లో 16 నాటౌట్ 2 ఫోర్లు, 1 సిక్సర్)లు చెలరేగారు. ఒకే ఓవర్లో 27 పరుగులు (4, 4, 6, 1, 6, 6) పిండుకున్నారు. ఫలితంగా ఐపీఎల్-5లో భాగంగా పీసీఏ స్టేడియంలో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. భజ్జీసేన ఒక్క బంతి మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 168 పరుగులు చేసింది. డేవిడ్ హస్సీ (40 బంతుల్లో 68 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), మిల్లర్ (17 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు)లు రాణించారు. రాయుడుకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.